Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 21)..విమర్శలను ఎదుర్కోంటారు.
ఈ రోజు(2024 April 21) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
రుణప్రయత్నాలు విజయవంతంగా ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. అందువలన మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్యం ఉంది. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృషభం
అప్పు లభిస్తుంది. శుభకార్యం ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
మిథునం
పట్టుదలతో కొన్నిపనులు పూర్తిచేస్తారు. పిల్లలపట్ల జాగ్రత్త అవసరం. మీమీ రంగాల్లో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
కర్కాటకం
సమాజంలో మంచి పేరు వస్తుంది. మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యం అవుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండాలి. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహం
మొదలుపెట్టిన పనులకు ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్త అవసరం. మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కన్య
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
తుల
మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల వలన శతృబాధలను అనుభవిస్తారు. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
వృశ్చికం
నూతన కార్యాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. సహనంవహించడం చాలా మంచిది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య బాధలు వేదిస్తాయి.
మకరం
కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తత చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పులు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. స్వల్ప అనారోగ్య బాధలున్నాయి. మీమీరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళన చెందుతారు.
మీనం
అనవసరమైన భయాందోళనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీమీరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి.