AP: తిరుమల మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా ప్రత్యేక అభిషేక కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరు నక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తదితర అధికారులు హాజరయ్యారు.