»Shweta Menon Among 40 Bank Customers Who Lost Thousand Of Rupees In 3 Days
Shweta Menon: లింక్ పంపించి నటి ఖాతా నుండి డబ్బులు చోరీ
KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెలియని 40 మంది ఈ లింక్ పైన క్లిక్ చేసి కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయడంతో వారి వారి ఖాతాలలో నుండి లక్షల రూపాయలు మాయం అయ్యాయి.
KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెలియని 40 మంది ఈ లింక్ పైన క్లిక్ చేసి కస్టమర్ ఐడీ, పాస్ వర్డ్, ఓటీపీ ఎంటర్ చేయడంతో వారి వారి ఖాతాలలో నుండి లక్షల రూపాయలు మాయం అయ్యాయి. మూడు రోజుల్లోనే లక్షల మొత్తాన్ని కొట్టివేశారు ఈ సైబర్ నిందితులు. డియర్ కస్టమర్, ఈ రోజు మీ బ్యాంక్ అకౌంట్ లాక్ అయింది. కాబట్టి మీ పాన్ కార్డ్ వివరాలు, కేవైసీ పూర్తి చేసి సమస్యను పరిష్కరించుకోండి అని సందేశం పంపించింది. తెలియకుండా దీనిని ఫాలో అయిన వారి అకౌంట్ నుండి డబ్బులు మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు, ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు.