స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ స్కామ్ జరగడానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబుకు 15 రోజుల రిమాండ్‌ను విధిస్తూ కోర్టు అధికారులను ఆదేశించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ స్కామ్ జరగడానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని పేర్కొంది.
స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్డుపై భైటాయించి ధర్నా చేపడుతున్నారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాబు అరెస్ట్‌ను జీర్ణించుకోలేని ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో బస్సులు బంద్ అనే విషయాన్ని పలువురు నెట్టింట ప్రచారం చేయగా..దీనిని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. బస్సులు యాథావిధిగా నడుస్తున్నాయని వెల్లడించింది.
రూ.550 కోట్ల స్కాం జరిగిందని తెలిపిన ఏపీ సీఐడీ ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లో భాగంగా వెల్లడి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షేల్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారని ప్రకటన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి ఈ కేసులో 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడి ఈ మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీం పనిచేస్తుందన్నారు ఈ […]
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టు అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఈ కేసు విషయంలో అసలు విషయం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసు విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.