గూగుల్ తన సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించడానికి కృత్రిమ మేధ (AI)పై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. జనరేట్ చేసిన కోడ్ను ఇంజినీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందన్నారు. గూగుల్ మెరుగైన వృద్ధి వ్యూహంలో ఏఐది కీలక పాత్ర అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.