Zomato:ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato).. పేమెంట్స్ సర్వీసెస్ వ్యాపారంలోకి వచ్చింది. సొంతంగా యూపీఐ సర్వీస్ (UPI Service) ప్రారంభించింది. ఐసీఐసీ బ్యాంక్‌తో కలిసి జొమాటో పేమెంట్స్ సర్వీస్ స్టార్ట్ చేసింది. దీంతో యూజర్లు నేరుగా పర్సన్స్, బిజినెస్ మెన్స్‌కు జొమాటో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసే సౌకర్యం లభించింది.
యాప్.. గూగుల్ పేలో కాకుండా, జొమాటో యాప్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. రైడ్ సైడ్ టాప్‌పై టచ్ చేస్తే జొమాటో (Zomato) యూపీఐ కనిపిస్తోంది. యాక్టివేట్ బటన్ నొక్కితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మొబైల్ నంబర్ ఇచ్చి.. బ్యాంక్ అకౌంట్ జత చేయాల్సి ఉంటుంది. దాంతో జొమాటో (Zomato) యూపీఐ జనరేట్ అవుతుంది.
యూపీఐతో పేమెంట్స్ చేసుకోవచ్చని ఫుడ్ డెలివరీ సంస్థ తెలిపింది. ఇకపై యాప్‌లో ఏదైనా ఫుడ్ ఆర్టర్ చేయాలంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లకు రీ డైరెక్ట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.
ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, మొబి క్విక్, భారత్ పే ఉండగా.. కొత్తగా జొమాటో (Zomato) యూపీఐ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మరీ దీనికి జనం ఏ మేరకు ఆదరిస్తారో చూడాలీ.