నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు www.unionbankofindia.co.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 13 నవంబర్ 2024. ఏపీలో 200 పోస్టులు, తెలంగాణలో 200 పోస్టులు ఉన్నాయి.