jio : జియోకు రూ.ఐదు వేల కోట్ల లాభం

భారత దేశంలో అతి పెద్ద టెలికాం నెట్వర్క్‌ అయిన రిలయన్స్‌ జియో గత క్వార్టర్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఐదు వేల కోట్లకు పైగా నికర లాభాన్ని నమోదు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 01:12 PM IST

reliance jio : మన దేశంలో అగ్ర టెలికాం నెట్వర్క్‌ల్లో ఒకటైన రిలయన్స్‌ జియో(RELIANCE JIO ) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌కి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. క్వార్టర్‌ 4లో రూ.5,337 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.4,716 కోట్ల నికర లాభం వచ్చింది. దానితో పోలిస్తే ఈ ఏడాది 13 శాతం అధికంగా లాభం వచ్చినట్లు సంస్థ తెలిపింది.

చదవండి : తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు పై 6.3గా నమోదు

ఇక 2023 – 24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే జియో సంస్థ రూ.20,466 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.1,00,119 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.2శాతం అధికం అని సంస్థ తెలిపింది.

చదవండి : స్టార్ హీరోకి జోడీగా శ్రీలీల..!

ఇక ముకేష్‌ అంబానికీ చెందన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(RELIANCE INDUSTRIES) సైతం నాలుగో క్వార్టర్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. ఈ క్వార్టర్‌లో నికర లాభం స్వల్పంగా తగ్గింది. రూ.18,951 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో 19,299 కోట్ల నికర లాభం వచ్చింది. దానితో పోలిస్తే ఈ నాలుగో క్వార్టర్‌లో వచ్చిన లాభం రెండు శాతం మేర తక్కువ.

Related News

Mukhesh Ambani : దట్ ఈజ్ అంబానీ.. రెండు గంటల్లో రూ.66వేల కోట్ల సంపాదన

Mukhesh Ambani : పార్లమెంట్లో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్‌లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రకటన కారణంగా.. నేడు మార్కెట్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి ఇతర గ్రీన్ ఎనర్జీ స్టాక్‌లకు గ్రీన్ ఎనర్జీ స్టాక్‌లు పెరిగాయి. 135 నిమిషాల్లోనే కంపెనీ వాల్యుయేషన్‌లో దాదాపు రూ.66 వేల కోట్లు పెరిగాయి. విశేషమేమిటంటే కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ షేర్లు […]