చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ భారత మార్కెట్లోకి నూతన 5జీ ఫోన్‌ను ఓపెన్ చేసింది. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీకి కొనసాగింపుగా హాట్ 30 5జీని (Infinix Hot 30 5G) తీసుకొచ్చింది. 50 ఎంపీ కెమెరా, 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ(mAh battery) వంటి ఫీచర్లతో రూ.12వేల ధరలో 5జీ ఫోన్‌ను తీసుకురావడం గమనార్హం. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.12,499గా నిర్ణయించింది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.13,499గా తెలిపింది. అరోరా బ్లాక్(Aurora Black), నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ (Android) 13 ఆధారిత XOS 13తో పనిచేస్తుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120HZ రిఫ్రెష్ రేటుతో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇన్ఫినిక్స్ మెమోఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా ఖాళీగా ఉన్న స్టోరేజీని 16జీబీ వరకు ర్యామ్‌గా వినియోగించుకోవచ్చు.ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. మైక్రో ఎస్డీ కార్డు (Micro SD card) ద్వారా 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇందులో 5జీ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో అమర్చిన 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో ఈ ఫోన్ ఒక రోజంతా ప్లే బ్యాక్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్(Fast charging)ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఫోన్ పని చేస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30 5జీ మందం 0.99 సెంటీమీటర్లు కాగా, బరువు 215 గ్రాములుగా ఉంది.