Meta Warns To Employees For Those Are Not Come TO Office
Meta Warns To Employees: కరోనా వైరస్ వల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇచ్చాయి. వైరస్ తగ్గినప్పటికీ.. కొందరు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అవును.. వారానికి రెండు, మూడు రోజులు రమ్మని పిలుస్తోన్నా నో అంటున్నారు. అలాంటి వారికి మెటా (Meta) గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారంలో 3 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది. లేదంటే జాబ్ కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది.
వచ్చే నెల 5వ తేదీ నుంచి వారానికి 3 రోజులపాటు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు మెటా (Meta) స్పష్టంచేసింది. ఏదో సాకు చెప్పి ఎగొట్టొద్దు అని తేల్చిచెప్పింది. అలా చేస్తే జాబ్ పోయే అవకాశం ఉందని చెప్పింది. ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నది.. లేనిది చెక్ చేయాలని మేనేజర్లకు సూచించింది.
ఉద్యోగుల మధ్య బంధం బలోపేతం చేయడానికి.. టీమ్ వర్క్ చేయడానికి తమ నిర్ణయం ఉపయోగ పడుతోందని తెలిపింది. దీనికి రిమోట్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. ఆఫీసులో ఉంటూ పనిచేస్తేనే డెవలప్ అవుతాం.. ఇంట్లో ఉండి వర్క్ చేసే వారి కంటే ఆఫీసుకు వచ్చి పనిచేసే వారి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఇదే విషయాన్ని మెటా (Meta) సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.