»Isro Chandrayaan 3 No One Has The Right To Buy Land On Moon
Moon: చంద్రుడిపై ల్యాండ్ కొనడం నిజమా? అబద్ధమా?
చంద్రుడిపై చాలా మంది ల్యాండ్ కొట్టున్నారు. భవిష్యత్తులో నిజంగానే అక్కడ ఇళ్లు కట్టుకోవచ్చని, వ్యాపారాలు చేసుకోవచ్చని కలలు కట్టున్నారు. నిజానికి అక్కడ భూమి కొని వ్యాపారం చేసుకోవడానికి వీలు ఉంటుందా? అసలు ప్లాట్లు అమ్మే కంపెనీలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ISRO Chandrayaan-3 No one has the right to buy land on moon
Moon: చంద్రయాన్ 3(Chandrayaan-3) మిషన్ సక్సెస్ అవడంతో ప్రపంచమంతా చంద్రుడిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూన్‌పై రియల్ ఎస్టేట్ బిజినెస్(Real estate business) ప్రారంభం అయింది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ ఎన్ఆర్ఐ మహిళ తన తల్లికి చంద్రుడి మీద ప్లాట్ కొనుగోలు చేసి వార్తల్లోకి వచ్చింది. గతంలో బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్(Sharuk Khan), సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ తదితరులు చంద్రుడిపై ప్లాట్లు కొన్నారు. దీనికి తోడు ఎకరా ధర కేవలం రూ.3 వేలకే అని కొన్ని లూనార్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో వేలాది మంది చంద్రుడిపై ప్లాట్లు కొంటు డాక్యుమెంట్లు చూపిస్తూ ఆనందపడుతున్నారు. భవిష్యత్తులో తాము ఆ ల్యాండ్‌ని ఏం చేయాలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. నిజానికి చంద్రుడిపై మనం ప్లాట్లు కొనొచ్చా? వాటికి చట్టబద్ధత ఉంటుందా? అంటే నో అనే చెప్పాలి.
చంద్రుడు మా దేశానికి చెందినదే అని చైనా తప్పా మరేదేశము ఇంత వరకు బాహటంగా ప్రకటించలేదు. చైనా(China) భూభాగంపై విస్తరించి ఉన్న స్పెస్ అంతా తమదేనని, అలాగే చంద్రుడు(Moon) కూడా తమ దేశానికి చెందిందే అని ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో సోవియెట్ యూనియన్(Soviet Union), అమెరికా(America), బ్రిటన్(Britain) 1967 జనవరి 27న ఔటర్ స్పేస్ ట్రీటీ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆగస్టు 2023 నాటికి ఈ ఒప్పందంపై ఇండియా సహా 114 దేశాలు సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఔటర్ స్పేస్‌పై, చంద్రుడు సహా ఇతర ఖగోళ వ్యవస్థపై ఏ ఒక్క దేశానికి హక్కులు ఉండవు.
మూన్‌పై ల్యాండ్ కొంటే ఏం అవుతుంది.
చంద్రుడిపై భూమి కొని అక్కడ వ్యాపారం చేయాలని కలగనే వారికి అది కలగానే మిగులుతుంది. అంటే అక్కడ ల్యాండ్ కొన్నట్లు జస్ట్ పేపర్ మాత్రమే ఉంటుంది. తప్ప నిజమైన ల్యాండ్ మార్కింగ్ అంటూ ఏమి ఉండదు. అయితే మూన్ ప్లాట్లను అమ్మే కంపెనీలు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను, మ్యాపులను అందంగా తీర్చిదిద్ది కస్టమర్లకు ఇస్తున్నాయి. ఈ ప్లాట్లను ఇతరులకు గిఫ్ట్ గా ఇవ్వొచ్చని, ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని కూడా నమ్మిస్తున్నాయి. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లకు ఎలాంటి చట్టబద్ధత లేదు. ఏదైనా ఒక ఎరియాను కొని రిజస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందు అది ఒక సార్వభౌమ దేశ అధీనంలో ఉండాలి. ఆ భూమిపై హక్కుల మార్పిడి, లావాదేవీలు నిర్వహించేందుకు ఆయా దేశంలో సరైన చట్టాలు ఉండాలి. కానీ చంద్రుడి భూమిపై ఏ దేశానికి కూడా సార్వభౌమ అధికారం లేదు. చట్టాలు లేవు. అలాంటప్పుడు ఆ భూమిని కొనడం, అమ్మడం అసాధ్యం. మూన్ ప్లాట్లను కొంటే ఆ ఫొటోలను, డాక్యుమెంట్లను ఫ్రేం కట్టించుకుని గోడకు తగిలించుకుని ఆనందపడాల్సిందే.ఆనందపడాల్సిందే.
ప్లాట్లు అమ్మె కంపెనీలు ఏం చెబుతున్నాయి
చంద్రుడిపై ప్లాట్లు అమ్ముతున్న లూనార్ రిజిస్ట్రీ, లూనార్ ఎంబసీ వంటి కంపెనీలు చాలానే ఉన్నాయి. ఏరియాను బట్టి ఎకరాకు కనీసం రూ.3 వేలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి. ఈ కంపెనీలేవీ చట్టబద్ధమైనవి కావు. అంతేకాదు తమ కంపెనీలకు ఏ దేశ ప్రభుత్వాలతో సంబంధాలు లేవని తమ వెబ్సైట్లలో రాస్తున్నాయి కూడా. లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చంద్రుడిపై రీసెర్చ్, మానవ ఆవాసాల ఏర్పాటుకు ప్రైవేట్ ఫండింగ్ కోసమే ప్లాట్లు అమ్ముతున్నామని లూనార్ రిజిస్ట్రీ కంపెనీ చెప్తోంది.