Gold Rates Today : దిగివస్తున్న బంగారం, వెండి ధరలు
గత కొంత కాలంగా రికార్డు హైయెస్ట్ ధరల్ని నమోదు చేసుకున్న వెండి, బంగారం క్రమంగా దిగివస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
hyderabad and visakhapatnam delhi gold rates on december 13th 2023
Gold and Silver Rates Today : రేటు తగ్గితే పసిడిని కొనుక్కోవాలని చూసుకునే వారికి శుభవార్త. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని అంటిన వెండి, బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు లోహాల ధరలు కూడా వరుసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.560 తగ్గింది. దీంతో నేడు దీని ధర రూ. 73,764కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సైతం పసిడి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.73,764గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని మాత్రమే. నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని కొనుగోలుదారులు గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) సైతం బాగానే తగ్గింది. సోమవారం రూ. 846 తగ్గింది. దీంతో నేడు కిలో వెండి ధర రూ.92,024కు చేరుకుంది.హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్టణాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా వరుసగా నాలుగు రోజులుగా తగ్గుతూ ఉండటం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఔన్సు బంగారం ధర సోమవారం ఐదు డాలర్లు తగ్గింది. దీంతో దీని ధర ఇప్పుడు 2,323 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 30.14 డాలర్లుగా ఉంది.