Gold Rates Today : భారీగా పెరుగుతున్న బంగారం, స్థిరంగా వెండి ధర
బంగారం ధరలు స్థిరంగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే వారం అంతా పెరుగుతూనే ఉన్న వెండి ధర శనివారం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.67,228 ఉండగా, శనివారం నాటికి రూ.612 పెరిగి రూ.67,840కు చేరుకుంది. వారం మొత్తం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్న పసిడి శనివారం మాత్రం ఒక్కసారిగా ఏకంగా రూ.600 పైనే పెరగడం గమనార్హం.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.67,840గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) శనివారం రూ.20 తగ్గి రూ.74,790కు చేరుకుంది. శుక్రవారం ఆ ధర రూ.74,810గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2158 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 21 డాలర్లు పెరిగి 2179కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 24.32 డాలర్లుగా ఉంది.