Adani Ports repays Rs 1,500 cr:రూ.1500 కోట్ల (1500 crores) నగదును అదానీ గ్రూప్ చెల్లించింది. ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్‌కు రూ.1000 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్‌కు రూ.500 కోట్లను చెల్లించింది. ఈ రెండు లోన్ల చెల్లింపు గడువు సోమవారమే ముగిసింది. మరో రూ.1000 కోట్లను మార్చి నెలలో చెల్లించాల్సి ఉంది.
Adani Ports repays Rs 1,500 cr:హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ (adani) సంపద అవిరి అయిన సంగతి తెలిసిందే. ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ ర్యాంకు దిగజారింది. విపక్షాలు అయితే ప్రధాని మోడీ (modi) లక్ష్యంగా విమర్శలకు దిగాయి. పార్లమెంట్‌ను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ క్రమంలో అదానీ పోర్ట్ (adani port), స్పెషల్ ఎకనామిక్ జోన్ లోన్స్ చెల్లించింది.
రూ.1500 కోట్ల (1500 crores) నగదును చెల్లించింది. ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్‌కు రూ.1000 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యుచువల్ ఫండ్‌కు రూ.500 కోట్లను చెల్లించింది. ఈ రెండు లోన్ల చెల్లింపు గడువు సోమవారమే ముగిసింది. మరో రూ.1000 కోట్లను మార్చి నెలలో చెల్లించాల్సి ఉంది. హిండెన్ బర్గ్ నివేదికతో లోన్ చెల్లింపు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆలస్యం చేయకుండా తీసుకున్న రుణం పే చేసేసింది.
ఈ రెండు చెల్లింపులను నగదు నిల్వలు, వ్యాపారం ద్వారా వచ్చిన నిధుల నుంచి జరిపినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చెల్లింపులతో తమ కంపెనీపై (company) మరింత నమ్మకం కలుగుతుందని చెప్పారు. చెల్లింపుల తర్వాత ఎస్బీఐ (sbi) ఎంఎఫ్ అధికార ప్రతినిధి మాట్లాడారు. తాము ఇచ్చిన అప్పును అదానీ గ్రూపు (adani group) చెల్లించిందని వివరించారు. కంపెనీకి తదుపరి రుణం ఇచ్చే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు.