TG: విద్యార్థినిపై స్నేహితులే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వరంగల్‌లో జరిగింది. స్నేహం ముసుగులో బీఫార్మసీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థిని, తనకు స్నేహితులైన యువకులు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఓ రోజు ముగ్గురు కలిసి హోటల్‌కు వెళ్లారు. అక్కడ విద్యార్థినికి మద్యం తాగించిన యువకులు.. ఆమెపై అత్యాచారం చేశారు. కాగా, గత నెల 15న ఈ ఘటన చోటుచేసుకోగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.