ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. తాజాగా బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న.. ఆకాశ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం అత్యవసరంగా HYDలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయింది. అప్రమత్తమైన CISF, ఎయిర్‌పోర్టు సిబ్బంది, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలతో విమానంలో సోదాలు నిర్వహించి.. ఫేక్ కాల్‌గా నిర్ధారించారు.