కాకినాడ: ప్రియుడి మోజులో భర్తకు విషంపెట్టి చంపిన ఘటన ఈనెల 19న జరగగా ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని ఏవీ నగర్లో ఉంటున్న మృతుడు మధు భార్య తనతో పాటు హాస్పిటల్లో పని చేస్తున్న ప్రశాంత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన మధు ఇంట్లో గొడవలు చేయగా అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి విషంపెట్టి చంపేసింది. హత్యను సాధారణ మృతిగా చిత్రీకరించాలని చూసినా.. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.