W.G: పాలకొల్లు శివారు అయ్యప్ప గుడి సమీపంలోని పూలపల్లి బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ద్విచక్ర వాహనం ఢీ కొట్టి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో స్థానికులు వెంటనే కాలువలోకి దూసుకెళ్లిన బైకు, గాయపడిన వ్యక్తిని బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.