పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు అలుముకున్నాయి. తమ దేశంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై విరుచుకుపడింది. ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన ఇద్దరు సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.