»Ys Jagan Interesting Comments On Ap Assembly Elections
YS Jagan: ఏడాది లోపు ఎన్నికలు అన్న జగన్
ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయని, కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం, ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను, మంత్రులను, నియోజకవర్గ ఇంచార్జులను ఆదేశించారు జగన్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Andhra Pradesh Assembly Elections) సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం (Gadapa Gadapaku Mana Prabhutwam) పైన సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు (MLAs), మంత్రులు (Ministers), నియోజకవర్గ ఇంచార్జులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జీలు నెలలో ఇరవై రోజుల పాటు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఏడాది లోపు ఎన్నికలు జరుగుతాయన్నారు. కాబట్టి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Prabhutwam), ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో 2023 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోను (Andhra Pradesh Assembly Elections) జగన్ (YS Jagan) ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఆయన తెలంగాణతో (Telangana) పాటు ఏపీలోను ఎన్నికలు కోరుకుంటున్నారనే వాదనలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే 2024 మే నెలలోనే జరుగుతాయని జగన్, ఇతర వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి యథాలాపంగా అలా అని ఉంటారనే వారు కూడా లేకపోలేదు.
కేబినెట్ మార్పు పైన కూడా…
రాష్ట్రంలో 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా మనం 17 సీట్లు గెలుచుకున్నామని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా వదులుకోమని చెప్పారు. అందరినీ గెలిపించుకుంటామని, కానీ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే సెప్టెంబర్ నుండి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడదామన్నారు. వచ్చే ఎన్నికల్లో అరవై మంది ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం సాగుతోందని, కానీ ఒక్క ఎమ్మెల్యేను లేదా కార్యకర్తను పోగొట్టుకోమని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారన్నారు. కేబినెట్ మార్పుల పైన కూడా క్లారిటీ ఇచ్చారు.