Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ ఫుల్ రివ్యూ
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సుకుమార్ సమర్పణలో విరూపాక్ష సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
సినిమా – విరూపాక్ష నటీనటులు – సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సోనియా సింగ్, రవికృష్ణ, సునీల్, అజయ్, తదితరులు దర్శకుడు – కార్తీక్ దండు నిర్మాత – BVSN ప్రసాద్ సంగీతం – బి.అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ – శామ్‌దత్ సైనుదీన్ బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర విడుదల తేదీ – ఏప్రిల్ 21, 2023
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సాయిధరమ్ తేజ్ మళ్లీ తెరపైకి పాన్ ఇండియా చిత్రంతో వచ్చేశారు. అతని చివరి చిత్రం రిపబ్లిక్. సంయుక్త మీనన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా స్టోరీ ఎంటీ, ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
రుద్రవరం గ్రామస్తులు వెంకట చలపతి (కమల్ కామరాజు)ని పలు కారణాలతో ఆరోపిస్తూ అతని కుటుంబాన్ని సజీవ దహనం చేస్తారు. ఆ క్రమంలో అతని భార్య చనిపోయే ముందు ఆ గ్రామానికి శాపం ఇస్తుంది. ఆ నేపథ్యంలో పన్నెండేళ్ల తర్వాత మళ్లీ మరణాలు మొదలవుతాయి. అదే క్రమంలో సూర్య (సాయి ధరమ్ తేజ్) ఆ గ్రామానికి వచ్చి నందిని (సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. అయితే నందిని కారణంగా సాయి ధరమ్ తేజ్ గ్రామంలో గుండాలచే దాడికి గురవుతాడు. ఆ క్రమంలో అసలు వరుస మరణాల సంగతి ఎంటీ? అతను అసలు నిజం కనుగొన్నాడా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? విరూపాక్షుడు ఆ రహస్యాన్ని ఛేదించాడా లేదా అనేది అసలు స్టోరీ.
ఎవరెలా చేశారు
సాయిధరమ్ తేజ్ తొలిసారిగా విరూపాక్షతో థ్రిల్లర్ జానర్‌ని ప్రయత్నించాడు. ఇది ఈ హీరోకు మంచి పునరాగమమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పాత్రకు సాయి ధరమ్ తేజ్ తగ్గట్టుగా యాక్ట్ చేశారు. మరోవైపు హీరోయిన్ గా సంయుక్తా మీనన్ తన క్యారెక్టర్ మేరకు బెస్ట్ ఇచ్చింది. రాజీవ్ కనకాలకి రొటీన్ రోల్ వచ్చింది. అజయ్ అఘోరాగా ఆకర్షించాడు. అతను క్రోధ స్వభావం గల పోలీసు పాత్రలో విభిన్నమైన పాత్రలో నటించడం చాలా బాగుంది. సాయి చంద్, అభినవ్ గోమతం, సోనియా సింగ్, రవికృష్ణ ఇచ్చిన పాత్రల్లో చక్కగా నటించారు. సునీల్ మొదట్లో కీలక పాత్రలో కనిపించినా కథ ముందుకు వెళ్లే కొద్దీ ప్రాముఖ్యత కోల్పోతాడు. చాలా కాలం తర్వాత కమల్ కామరాజు పెద్ద క్యారెక్టర్లో కనిపించి ఆకట్టుకున్నారు.
సాంకేతికత
విరూపాక్ష మూవీ అన్ని అంశాలతో కూడిన చక్కని థ్రిల్లర్ మూవీ. సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే విరూపాక్షకు వెన్నెముక అని చెప్పవచ్చు. సినిమా చాలా వరకు విలేజ్ సెటప్‌లో జరుగుతుంది. దానిని చక్కగా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అజ్నీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చాలా సన్నివేశాలను మెరుగుపరిచింది. దర్శకుడు తన తొలి సినిమాకి బాగా చేశాడు.
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
ఇంటర్వెల్ ట్విస్ట్
క్లైమాక్స్
బీజీఎం
మైనస్ పాయింట్స్
లవ్ ట్రాక్
కొన్ని ల్యాగ్ సీన్స్
కొన్ని చోట్ల థ్రిల్ లేకపోవడం