‘లైగర్’ వంటి ఫ్లాప్ తర్వాత ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. నిన్ను కోరి, మజిలీ.. వంటి ఎమోషనల్ లవ్‌స్టోరీలు తీసిన ‘శివ నిర్వాణ’.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుషి సినిమాను కూడా హత్తుకునే ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు.. మధ్యలో అనుకోకుండా బ్రేక్ పడింది. ప్రస్తుతం సమంత ‘మయోసైటిస్’ అనే వ్యాదితో బాధపడుతోంది. అందుకే డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ‘ఖుషి’ వచ్చే సమ్మర్‌కు పోస్ట్‌పోన్ అయింది. సమంత కోలుకున్న తర్వాత ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో క్యూట్ బ్యూటీ కృతిశెట్టి కూడా జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు కూడా స్కోప్ ఉందట. అది కూడా సెకండాఫ్‌లో కథను మలుపు తిప్పే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం కృతిశెట్టిని తీసుకున్నట్టు సమాచారం. ఆమె పాత్ర నెగటివ్ షేడ్ కలిగి ఉంటుందని.. ఆ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని.. కృతి కెరీర్లోనే ది బెస్ట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కృతి దాదాపుగా ఖాయమైనట్టేనని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ‘ది వారియర్’, ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలతో వెనకబడిపోయింది కృతి. అయినా అమ్మడికి అవకాశాలు తగ్గడం లేదు. ఈమెనే కాదు విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి ఖుషి కాంబో ఇంట్రెస్టింగ్గా మారింది.