»Tspsc Question Paper Leak Case For Rs 14 Lakhs Deal Paper Sale For Some People
TSPSC Paper Leak:రూ.14 లక్షలకు క్వశ్చన్ పేపర్..కొంత మందికి పేపర్ అమ్మకం!
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు(police) విచారణలో కీలక విషయాలు తెలిసినట్లు పేర్కొన్నాయి. TSPSC కమిషన్ ఆఫీసులో అత్యంత భద్రంగా ఉండే సిస్టమ్ నుంచి సమాచారం చోరీ చేసింది సిబ్బంది మాత్రమేనని తేలింది. అయితే ఆ క్వశ్చన్ పేపర్ ను రూ.14 లక్షలకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నట్లు తెలిసింది. దీనిలో ఇద్దరికి వాటా ఉందని.. ఆ నగదును పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే రూ.10 లక్షలు ఇచ్చారని..ప్రశ్న పత్రాలను బహిరంగంగానే అమ్ముతున్నారని తెలిసింది.
ఈ క్రమంలో అసలు ప్రశ్న పత్రాలను ఎలా బయటకు తీశారు అనే అంశంపై పోలీసులు(police) మరింత వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుతం 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్, మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా..ఈ లీక్ వ్యవహారం నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.
TSPSC సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు ప్రభుత్వ ఉద్యోగి రేణుకతో పరిచం ఏర్పడింది. ఆ క్రమంలో ప్రవీణ్ కలిసేందుకు ఆమె పలు మార్లు TSPSC ఆఫీసుకు వచ్చేది. ఆ క్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ కు సంబంధించి పేపర్ లీక్ చేసి డబ్బులు దండుకోవాలని చూశారు. ఆ నేపథ్యంలో తన తమ్ముడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్నాడని క్వశ్చన్ పేపర్ కావాలని ఆమె ప్రవీణ్ ను కోరింది. ఎవరికి విషయం చెప్పనని తెలిపింది.
దీంతో నమ్మిన ప్రవీణ్ అడ్మిన్ రాజశేకర్ తో కలిసి లీకేజ్ గురించి ప్రవీణ్ చెప్పాడు. అలా ఇద్దరు కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ సిస్టమ్ లోని పేపర్ దొంగిలించాలని ప్లాన్ వేసుకున్నారు. ఆ క్రమంలో శంకరమ్మ ఆఫీసుకు వచ్చే సమయం, తిరిగి వెళ్లే టైంతోపాటు ఆ సిస్టమ్ పాస్ వర్డ్ ను కుడా గుర్తించారు. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆఫీసులో ఎవరూ లేని టైం చూసి కంప్యూటర్లో క్వశ్చన్ పేపర్ ను రాజశేఖర్, ప్రవీణ్ పెన్ డ్రైవ్లో డౌన్ లోడ్ చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ ప్రింట్ తీసుకుని రేణుకకు అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారుల ఫిర్యాదుతో సెక్రటరీ పీఏ ప్రవీణ్ తో పాటు రాజశేఖర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఆ క్వశ్చన్ పేపర్ ను రేణుకు ముందు అతని తమ్ముడికి ఇచ్చేసింది. కానీ అంతటితో ఆగలేదు. ఆ పేపర్ ద్వారా మనీ సంపాదించాలనుకుంది. ఆ పరీక్ష తెలిసిన వారు ఎవరెవరు రాస్తున్నారో ఆరా తీసింది. ఆ క్రమంలో వారి తన ఊరి సర్పంచ్ కుమారుడు రాస్తున్నాడని తెలుసుకుని అతనితోపాటు మరో ముగ్గురికి రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుంది. అలా ఆమెకు రూ.14 లక్షలు రాగా ప్రవీణ్ కు రూ.10 లక్షలు ఇచ్చేసింది. వాటిని రాజశేఖర్, ప్రవీణ్ పంచుకున్నట్లు తెలుస్తోంది.
కానీ రేణుక నుంచి క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసిన సర్పంచ్ కుమారుడు మరికొంత మందికి అమ్మి డబ్బులు దండుకోవాలని ప్లాన్ వేశాడు. ఆ క్రమంలో లక్ష రూపాయలు ఇస్తే ఆ ఎగ్జామ్ పేపర్ జిరాక్స్ కాపీ ఇస్తానని పలువురికి సమాచారం ఇచ్చాడు. దీంతో అలా కొంతమంది ఆశ పడగా..మరికొంత మంది పోలీసులకు తెలిపారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఈ ఒక్క ప్రశ్న పత్రామే లీకైందా? లేదా ఇప్పటికే అనేక పేపర్లు ఇలాగే లీక్ చేశారా అనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులు ఈ లీక్ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. TSPSCలొ పేపర్ లీక్ అవటంపై దర్యాప్తు ముమ్మరంగా చేయాలని కోరుతున్నారు. అసలు TSPSC సెక్రటరీ PAను ఎవరు నియమించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. PAనే ఈ రకంగా రెచ్చిపోతే ఇతర ఉద్యోగుల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో TSPSCలో పని చేసే ప్రతి ఉద్యోగి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.