»The News Of A Philippine Woman Riding A Bicycle With A Bottle On Her Scalp Has Gone Viral
Viral video: తలపై బాటిల్ తో సైకిల్ తొక్కిన యువతి
ఓ బాటిల్‌ను తలపై పెట్టుకొని బ్యాలెన్స్డ్గా ఓ యువతి సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు అరె.. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తుందని ఆశ్యర్యపోయి చూస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
The news of a Philippine woman riding a bicycle with a bottle on her scalp has gone viral.
Viral news: సోషల్ మీడియా(Social media) ప్రభావం వలన ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే వైరల్‌గా మారుతున్నాయి. అందులో భాగంగ ఒక మహిళా సైకిల్ తొక్కిన వీడియో వైరల్ గా మారింది. అందులో ఏముంది వింత అంటారా. అయితే ఆమె తన నెత్తిపై ఒక బాటిల్ పెట్టుకొని మరీ ఎక్కడ బ్యాలెన్స్(Bottle balance) తప్పకుండా సైకిల్ తొక్కుతూ వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియోవైరల్‌గా మారడంతో ప్రజలు పెద్ద ఎత్తున దాన్ని వీక్షిస్తున్నారు. తన ఫీట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. తొక్కుతూనే రెండు చేతులను వదిలేస్తుంది. వెనక్కి కూడా తిరుగుతుంది.
ఫిలిప్పీన్స్(Philippines)కు చెందిన మారియెల్లే అమాబా దానిని 2021లో తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అమెరికాలో సోషల్ మీడియా దిగ్గజం అయిన రెడ్డిట్(Reddit)లో ఈ వీడియో ఇటివల పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారడమే కాకుండా చాలా మంది దీన్ని ఛాలెంజ్‌గా తీసుకొని ఇలా ట్రై చేస్తున్నారు. కానీ వారి వల్ల అవడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్లిప్‌లో ముసుగు ధరించిన అమాబా తన బైక్‌పై ఒక వైపు నుంచి మరొక వైపుకు తిరుగుతూ సైకిల్ తొక్కుతుంది. ఒక సమయంలో సైకిల్‌ను మొత్తం వన్ సైడ్ వంచి నడుపుతోంది. అయినా సరే ఆమె తలపై బాటిల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా విపరీతమైన షేర్స్ వచ్చినట్లు తెలుస్తుంది.