»Russias Luna 25 Rocket To Compete With Indias Chandrayaan 3
Luna25: చంద్రయాన్ 3కి పోటీగా రష్యా ప్రయోగం..మన కంటే ముందే
దాదాపు 50 ఏళ్ల తరువాత మళ్లీ అంతరిక్షంలోకి రష్యా రాకెట్‌ను ప్రయోగించింది. ఇండియా చేపట్టిన చంద్రయాన్3కి పోటీగా రష్యా లూనా-25ని ప్రయోగించడం విశేషం. అయితే ఇది ఇండియా రాకెట్ కంటే ముందే అక్కడికి చేరుకుంటుందని అంటున్నారు.
Russia's Luna-25 rocket to compete with India's Chandrayaan 3
Luna-25: రష్యా లూనా-25 పేరుతో చంద్రుడిపైకి రాకెట్‌ను పంపింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ అంతరిక్ష ప్రయోగం చేపట్టింది. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన రోస్కాస్మోస్ విడుదల చేసిన చిత్రాల ప్రకారం.. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.10 గంటలకు లునా-25 నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత జాబిల్లి (Moon)పై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను దిగేలా ఈ ప్రయోగం చేపట్టారు.
1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇదే. అయితే భారతదేశం జులై 14న చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ ఎక్స్‌పరిమెంట్‌ను చేసిన తొలిదేశంగా చరిత్ర సృష్టించిన భారత్ కు పోటీగా రష్యా చేసింది. ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు (ISRO)..లునా -25 ప్రయోగంతో రష్యా (Russia) పోటీ ఇస్తోంది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడే అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇది కేవలం ల్యాండర్ మిషన్ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. కానీ ఇండియ పంపిన చంద్రయాన్-3 రాకెట్ ఏకంగా 3900 కేజీల పెలోడ్ను మోసుకెళ్తుంది. ఇస్రో చేసిన ఈ ప్రయోగానికి ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం జాబిల్లికి అతి చేరువలో ఉన్న ఇండియన్ మిషన్ చంద్రుడికి కేవలం 1500 కిలో మీటర్ల దూరంలోనే ఉంది.