»Prashanth Neel Is Another Telugu Project But Not As A Director
Prashanth Neel: మరో తెలుగు ప్రాజెక్ట్.. కానీ డైరెక్టర్‌గా కాదు!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) గురించి అందరికీ తెలిసిందే. కెజియఫ్ సినిమాలతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ప్రశాంత్ నీల్. మూడో సినిమాతోనే వెయ్యి కోట్లు రాబట్టి.. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో టాప్ 5లో నిలిచాడు. ప్రస్తుతం డైరెక్టర్‌గా టాప్ లిస్ట్‌లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు స్క్రీన్ ప్లే అందించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్(Prashanth Neel). హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. అయితే సలార్ సెకండ్ పార్ట్ ఎన్టీఆర్ 31 కంప్లీట్ అయ్యాకే ఉండే ఛాన్స్ ఉంది. సలార్ తర్వాత యంగ్ టైగర్‌తో భారీ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత కెజియఫ్ 3 కూడా లైన్లో ఉంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్. కానీ ఇప్పుడు రూట్ మార్చినట్టు తెలుస్తోంది.
డైరెక్టర్‌గా భారీ సినిమాలు చేస్తున్న నీల్.. ఇక పై మిగతా సినిమాలకు స్క్రీన్ ప్లే ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్(sukumar) రైటింగ్స్ పేరుతో.. తన దగ్గర ఉన్న కథలు ఇస్తునే స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు సుకుమార్. రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విరూపాక్షకు స్క్రీన్ ప్లే అందించాడు సుక్కు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఓ తెలుగు సినిమాకు స్క్రీన్ ప్లే అందించబోతున్నాడట. కెజియఫ్ సినిమాను నిర్మించిన హోంబలె ఫిలింస్.. రాబోయే కాలంలో సినిమాల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అన్ని భాషల్లో సినిమాలు నిర్మించనున్నారు.
ఈ క్రమంలో తెలుగులోను ఓ స్ట్రెయిట్ ఫిల్మ్(movie) చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు రచయిత కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ ప్రశాంత్ నీల్‌కు తెగ నచ్చడం.. హోంబలే బ్యానర్ కావడంతో.. స్క్రీన్ ప్లే రైటర్‌గా వెంటనే ఓకె చెప్పాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఆదర్శ్ బాలకృష్ణ లీడ్ రోల్ పోషిస్తున్నాడట. ఏదేమైనా.. ఇక పై ప్రశాంత్ నీల్ కూడా సుకుమార్ లాగే మిగతా సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా కంటిన్యూ అవుతాడేమో చూడాలి.