»Mohan Babu Who Announced A 100 Crore Film What About Rajinikanth
Mohan Babu: వంద కోట్ల సినిమా ప్రకటించిన మోహన్‌బాబు
మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.
విలక్షణ నటుడు మోహన్ బాబు(Mohanbabu) తాను వంద కోట్ల సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. భారీ బడ్జెట్ సినిమా(High Budjet Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపాడు. ఆ మూవీ వివరాలను త్వరలోనే మంచు విష్ణు(Manchu Vishnu) వెల్లడిస్తాడన్నారు. గురువారం మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.
తన మిత్రుడైన సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajanikanth) గురించి మోహన్ బాబు(Mohanbabu) మాట్లాడారు. ఏపీలో టీడీపీ(TDP) నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రజనీకాంత్ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సభలో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌ను చూస్తుంటే అమెరికాలో ఉన్నామనే ఫీలింగ్ కలుగుతోందన్నారు. దానికి కారణం చంద్రబాబే అని రజనీకాంత్ అన్నారు. దీంతో అధికార వైసీపీ(YCP) నాయకులు రజనీకాంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా విమర్శించారు.
ఆ విషయంపై మోహన్ బాబు(Mohanbabu) స్పందిచకపోవడంతో తాజాగా తిరుమల(Tirumala)లో ఆయనకు రజనీకాంత్(Rajanikanth) ఏపీ పర్యటనపై ప్రశ్న తలెత్తింది. రజనీకాంత్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించగా అందుకు మోహన్ బాబు స్పందించారు. తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని అన్నారు. రజనీ గురించి మాట్లాడాలంటే ఒక్క రోజైనా సరిపోదన్నారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి. వంద కోట్ల ప్రాజెక్ట్ గురించి చెప్పమంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.