ప్రతి అవకాశాన్ని రాజకీయానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవం గ్రహించకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పనే చేయడానికి వెళ్తే మృతుడి కుటుంబం నుంచే వారికి పరాభవం ఎదురైంది.
అధికార పక్షంపై దుమ్మెత్తి పోయడానికి ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయి.. ఏ చిన్న అవకాశం (Chance) దొరుక్కుద్దా అని ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతి అవకాశాన్ని రాజకీయానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవం గ్రహించకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పనే చేయడానికి వెళ్తే మృతుడి కుటుంబం నుంచే వారికి పరాభవం ఎదురైంది. మీకో దండం అంటూ మృతుడు కుటుంబసభ్యులు (Family) సమాధానం ఇవ్వడంతో వారు తోక ముడుచుకుని రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన పరిస్థితి. ఈ సంఘటన తెలంగాణ (Telangana)లోని సిరిసిల్లలో చోటుచేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla District)లో ఇటీవల నవీన్ (Naveen) అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రూప్ 1 పరీక్ష (Group 1 Exam Cancelled) రద్దయిన సమయంలోనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం ఏర్పడింది. ఇక ప్రతిపక్ష పార్టీలు నవీన్ ఆత్మహత్యకు కారణం గ్రూప్ 1 పరీక్ష అని ఆరోపణలు చేశాయి. తీరా చూస్తే బాధితుడు వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలు ఆ యువకుడు గ్రూప్ 1 పరీక్షకే దరఖాస్తు చేసుకోలేదని తేలింది. అయితే ఇది తెలియని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (T Jeevan Reddy), వైఎస్ షర్మిల (YS Sharmila) బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆదివారం బాధితుడి ఇంటికి వెళ్లగా.. ‘మా కుమారుడి ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు’ అని కుటుంబసభ్యులు రాజకీయ నేతలను కోరారు.
‘మా అబ్బాయి గ్రూప్ 1కు దరఖాస్తు చేసుకోలేదు. మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. మా అబ్బాయి చనిపోయాడన్న బాధ కన్నా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే మమ్మల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి. దయచేసి మా అబ్బాయి ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు’ అంటూ మృతుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు విజ్ణప్తి చేశారు. ఈ పరిణామంతో షర్మిల, జీవన్ రెడ్డి షాక్ కు గురయ్యారు. అయినా వెంటనే వెళ్లిపోయారు.
కాగా మంత్రి కేటీఆర్ మృతుడి కుటుంబాన్ని అండగా నిలిచారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల యువకుడు కావడంతో మంత్రి కేటీఆర్ ఆదుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని పరామర్శకు వచ్చిన రాజకీయ నాయకులకు బాధిత కుటుంబం తెలిపింది. మంత్రి కేటీఆర్ ఆదుకుంటానన్నారు.. మీరు రాజకీయం చేయొద్దని కోరారు.
వాస్తవం ఇది..
సిరిసిల్లకు చెందిన నవీన్ హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు పూర్తి చేసి కొన్నేళ్లు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో పని చేశాడు. అనంతరం సిరిసిల్లలోని ఓ షాపింగ్ మాల్ లో పని చేశాడు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మంచి అవకాశాలు దక్కకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.