తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. విద్యార్థుల చదువుల గురించి మాట్లాడుతూ… ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. యువత ప్రేమ, దోమలు పక్కన పెట్టి కష్టపడి చదవాలని, పార్టీలు, ఫ్రెండ్షిప్ లు వదిలేయాలని అన్నారు. ముందు సరిగా చదువుకుంటే లైఫ్ పార్టనర్ వాళ్ళే వెతుక్కుంటూ వస్తారని అన్నారు. తన కొడుకుని డాక్టర్ చదువుకు పంపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందని, అదే రెడ్డి అమ్మాయిని చేస్తే పార్టీలు, కిట్టీ పార్టీ, పిక్నిక్ లు అంటూ తిరిగేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ తన కోడలు నా మెడికల్ ఇన్స్టిట్యూట్ లకు ఎండీ అయిందని మీరు కూడా అలానే కష్టపడి చదవాలంటే విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి. ఇక అలాగే మెడికల్ కాలేజీల్లో అంతా ఆన్ లైన్ లోనే సిస్టమ్ నడుస్తుందని, ఎక్కడా డొనేషన్లు వసూళ్లు చేయలేదని అన్నారు.
తనది అంతా ఓపెన్ హార్ట్ అని, మనసులో ఏం దాచుకోనని అన్నారు. మొన్న తన ఇంట్లో ఐటీ రైడ్స్ చేశారని, అయినా తన లెక్కలన్నీ క్లియర్ గా ఉన్నాయని అన్నారు. 400 మంది ఐటీ అధికారులతో వచ్చి దాడులు చేశారని, ఏం దొరక్క నిరాధారమైన ఆరోపణలు చేసి వెళ్లిపోయారని అన్నారు. తానేం తప్పు చేయలేదని.. ఎవరికీ భయపడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.