»Kishan Reddy Said Dgp Does Not Know In Which Case Bandi Sanjay Was Arrested
Kishan Reddy: బండి సంజయ్ ని ఏ కేసులో అరెస్టు చేశారో డీజీపీకి తెలియదా?
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టుకు గల కారణాలు రాష్ట్ర డీజీపీ(telangana dgp)కి తెలియకపోవడం చాలా దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. అసలు సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే కొద్ది సేపటి తర్వాత వివరాలు చెప్తామని అనడం మరి విడ్డూరంగా ఉందన్నారు. సంజయ్ అరెస్టు అయిన తర్వాత బీజేపీ కార్యకర్తల ఆందోళన జరుగుతున్నా కూడా ఆయనకు తెలియకపోవడం మరి దారుణమని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎంత సమర్థంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి విమర్శించారు.
ఈ క్రమంలో అసలు కారణాలు లేకుండా బండి సంజయ్ ని ఎలా అరెస్టు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) నిలదీశారు. ఈ నేపథ్యంలో సంజయ్ అరెస్టుకు గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ అరెస్టు(arrest)ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. రోజురోజుకూ తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నందునే కల్వకుంట్ల కుటుంబం.. అరాచకంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ తప్పులను ఎండగడుతున్నందుకే సంజయ్ ను కుట్రపూరితంగా అదుపులోకి తీసుకున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar)ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేశారు. భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri District) బొమ్మలరామారం (Bommalaramaram) పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంజయ్ అరెస్ట్ తో తెలంగాణలో బీజేపీ నాయకులు భగ్గుమన్నారు. ఆందోళనలో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ (Eatala Rajender), రఘునందన్ రావు (Raghunandan Rao), రాజా సింగ్ (Raja Singh)లను అదుపులోకి తీసుకున్నారు.