»Google Searches For Rrr Movie Song Natu Natu Increased By 1105 After The Oscars
Natu Natu: ‘నాటు నాటు’ కోసం 1,105% పెరిగిన గూగుల్ సెర్చ్‌లు
RRRలోని సూపర్ హిట్ పాట నాటు నాటు(Natu Natu song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar) అవార్డును గెల్చుకున్న తర్వాత సరికొత్త ఘనతను సాధించింది. ఈ క్రమంలో గూగుల్‌లో నాటు నాటు కోసం ఆన్లైన్ సెర్చ్‌లు ప్రపంచవ్యాప్తంగా 1,105 శాతం పెరిగాయని బుధవారం ఓ నివేదిక వెల్లడించింది. సాధారణం కంటే 10 రెట్లు ఈ పాట కోసం వెతికే వారి సంఖ్య పెరిందని ప్రకటించారు.
RRR మూవీలోని నాటు నాటు సాంగ్(Natu Natu song) మరో రికార్డు సృష్టించింది. ఇటీవల ఈ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar) అవార్డు(award) గెల్చుకున్న తర్వాత గూగుల్‌లో ఈ పాట కోసం అనేక మంది వెతికారని ఓ నివేదిక తెలిపింది. ఈ క్రమంలో ఈ సాంగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా వెతికిన వారి సంఖ్య దాదాపు 1,105 శాతం పెరిగిందని వెల్లడించారు. తెలుగు భాషా చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొద్ది గంటలకే ‘నాటు నాటు’ కోసం ఆన్లైన్లో వెతికే వారి సంఖ్య సగటు వాల్యూమ్ కంటే 10 రెట్లు(10 times) పెరిగిందని వెల్లడించింది.
ఈ సాంగ్ దేశంతోపాటు ఈ కేటగిరిలో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్(RRR MOVIE) రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫీ చేశారు. ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే ఎక్కువగా ప్రజాధారణ పొందింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలతోపాటు OTT ప్లాట్‌ఫాంలలో కూడా రికార్డు క్రియేట్ చేసింది.
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల అనేక మంది భారతీయులు(indians) సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(modi), టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ఎఆర్ రహమాన్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు RRR టీమ్‌ని అభినందించారు.
ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. దానితో పాటు జపాన్ లో జరిగిన 46వ అకాడమీ అవార్డ్స్ లోనూ అవుట్ స్టాండింగ్ ఫారెన్ మూవీ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డును దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవతార్ 2 సినిమాను, టాప్ గన్ సినిమాను వెనక్కి నెట్టింది. ఆస్కార్ అవార్డులను లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రదానం చేశారు.