Bahubali, RRRపై ప్రశంసల వర్షం..గోల్డెన్ గ్లోబ్ స్పెషల్ స్టోరీ!
ఒకప్పుడు టాలీవుడ్ అంటే బాలీవుడ్‌కి చిన్న చూపు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. ఇండియాలోనే కాదు.. హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు తొంగి చూస్తోంది. ఇదే విషయాన్ని చెబుతూ, ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ప్రముఖ అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్ తెలుగు సినిమా గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఏ ముహూర్తన రాజమౌళి(ss rajamouli), ప్రభాస్ కలిసి బాహుబలి సినిమాను అనుకున్నారో.. అప్పటి నుంచి బాహుబలికి ముందు ఆ తర్వాత అనేలా మారిపోయింది టాలీవుడ్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా పునాదులు వేసిన దర్శక ధీరుడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ ఆస్కార్ టార్గెట్‌గా మహేష్ బాబుతో వెయ్యి కోట్ల సినిమా చేయబోతున్నాడు రాజమౌళి.
ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ అనౌన్స్మంట్ ప్రాజెక్ట్ ఇదే. అందుకే తెలుగు సినిమా గొప్పతనాన్ని చెబుతూ.. గోల్డెన్ గ్లోబ్స్(Golden Globe) అవార్డుల సంస్థ తన పోర్టల్‌లో టాలీవుడ్ గురించి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో సౌత్ ఇండియన్ సినిమాల గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ లెక్కల ప్రకారం దేశంలో టాలీవుడ్ టాప్ ప్లేస్‌లో ఉందని రాసుకొచ్చింది.
గతేడాది తెలుగు చిత్రసీమ 212 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,754 కోట్ల నెట్ వర్త్‌ను సాధించిందని అంచనా వేసింది. కానీ బాలీవుడ్ 197 మిలియన్ డాలర్లు.. అంటే రూ.1,630 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉందని పేర్కొంది. ఇక ఆర్ఆర్ఆర్(RRR) సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది గోల్డెన్ గ్లోబ్ సంస్థ. ముందుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ట్రిపుల్ ఆర్.. ఆ తర్వాత ఆస్కార్ అవార్డ్‌ను అందుకుంది.
ఏదైనా సినిమాక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వస్తే.. ఖచ్చితంగా ఆస్కార్ వచ్చే అవాకశాలు ఎక్కువ. అదే విషయాన్ని మరోసారి ట్రిపుల్ ఆర్ నిరూపించింది. అందుకే ట్రిపుల్ ఆర్తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలపై ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే రాజమౌళి గత చిత్రాలైన బాహుబలి 1, బాహులి 2 గురించి కూడా ప్రశంసించింది. అంతే కాదు.. టాలీవుడ్(tollywood) నుంచి వచ్చిన సుకుమార్ ‘పుష్ప’, ప్రభాస్ ‘సాహో’, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘దూకుడు’ లాంటి విజయాల గురించి కూడా ప్రస్థావించింది.
మొత్తంగా.. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ నుంచి మొదలుకొని.. 1931 భక్త ప్రహ్లాద, హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్, ఎన్టీఆర్, చిరంజీవి, బ్రహ్మానందం, రాజమౌళి గురించి ప్రస్తావించింది గోల్డెన్ గ్లోబ్. ప్రస్తుతం ప్రాంతీయ భాషా చిత్రాలు అభివృద్ధి చెందుతున్నాయని.. ఈ విషయంలో టాలీవుడ్ అగ్రస్థానంలో ఉందని రాసుకొచ్చింది.