KDP: గుంతకల్ రైల్వే జంక్షన్ పరిధిలో కొండాపురం మండలంలోని రేగడపల్లి స్టేషన్ సమీపంలో గురువారం సాయంకాలం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతను రైలులో నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.