తాను నిర్మాతగా వ్యవహరించిన ‘లాస్ట్ లేడీస్’ ఆస్కార్ ప్రమోషన్స్‌లో నటుడు అమిర్‌ఖాన్ బిజీగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కొవిడ్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపా. దీంతో ఇంతకాలం కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేదని నన్నెంతో బాధించింది. దాంతో కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా. కిరణ్ రావు సపోర్టుగా నిలిచి.. తిరిగి సినిమాల్లో నటించేలా చేసింది’ అని చెప్పారు.