తనకు ఈడీ నుండి నోటీసులు ( ED notices ) అందాయని, దర్యాఫ్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ తనను ఢిల్లీలోని కార్యాలయానికి ( ED Delhi office ) రావాల్సిందిగా విచారణ సంస్థ నోటీసుల్లో పేర్కొన్నదని భారత రాష్ట్ర సమితి నాయకురాలు ( BRS leader ), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) గురువారం అన్నారు .
తనకు ఈడీ నుండి నోటీసులు ( ED notices ) అందాయని, దర్యాఫ్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ తనను ఢిల్లీలోని కార్యాలయానికి ( ED Delhi office ) రావాల్సిందిగా విచారణ సంస్థ నోటీసుల్లో పేర్కొన్నదని భారత రాష్ట్ర సమితి నాయకురాలు ( BRS leader ), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) గురువారం అన్నారు . ఆమె ఢిల్లీలో విలేకరుల సమావేశం ( kavitha press conference ) ఏర్పాటు చేసారు . ఈ సందర్భంగా మాట్లాడారు . 11వ తేదీన తన ఇంట్లో విచారణ చేయాలన్న తమ విజ్ఞప్తిని ఈడీ పట్టించుకోలేదన్నారు . ఈడీ కార్యాలయానికి ( ED office ) రావాలని తనకు స్పష్టం చేసిందన్నారు . దర్యాఫ్తు సంస్థలు మహిళలను అవమానించే పద్ధతి సరికాదన్నారు . దర్యాఫ్తును వీడియో కాన్ఫరెన్స్ ( Video Conference ) ద్వారా ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు . విచారణ సంస్థలు… మహిళలను విచారించే అంశం పైన అవసరమైతే సుప్రీం కోర్టుకు ( Supreme Court ) వెళ్తామని చెప్పారు . ఇది తన ఒక్కదాని సమస్య కాదన్నారు . ఈ కేసులోని ఇతర నిందితులను తన ఇంటికి తీసుకు వచ్చి కూడా వారితో కలిపి తనను విచారించవచ్చునని చెప్పానని వెల్లడించారు. కానీ ఈడీ పట్టించుకోలేదన్నారు . తనతో పాటు ఎవరిని విచారించినా సహకరిస్తానని చెప్పారు .
తాము ఉద్యమం ( Telangana Agitation ) నుండి వచ్చామని , ఎవరికీ భయపడే ప్రసక్తి ఉండదన్నారు . తెలంగాణ నేతలను ( Telangana Leaders ) వేధించడం కేంద్రానికి ( Central Government ) అలవాటుగా మారిందన్నారు . తాను విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పారు . ఈడీ తనకు నోటీసులు జారీ చేసి, హడావుడిగా తనను విచారణకు పిలిచిందని , ఎందుకో తనకు అర్థం కావడం లేదన్నారు . తనకు 9వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపించిందని , కానీ తాను 11వ తేదీన వస్తానని చెప్పానని అన్నారు . తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఎందుకు భయం అన్నారు . ఈడీ ఏది అడిగనా అన్నింటికి సమాధానాలు చెబుతానన్నారు . నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కాలేదన్నారు . ఈ అంశంలో తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ మొత్తం తన వెంట ఉందని చెప్పారు . బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ ( diversion politics ) బయట పెట్టాలని తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు . నేను చాలా ధైర్యంగా ఈడీ విచారణకు వెళ్తున్నానని అన్నారు .
ఎన్నికలు ఉండి , బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని ఆరోపించారు . మోడీ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ప్రతిపక్షాల పైన కేసులు అన్నారు . గాంధీ పుట్టిన దేశంలో అబద్దాల రాజ్యం నడుస్తోందన్నారు . విపక్షాలకు ఈ ప్రభుత్వం మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు . మోడీ అధికారంలోకి వచ్చాక వన్ నేషన్.. వన్ ఫ్రెండ్ అనే స్కీమ్ తీసుకు వచ్చారన్నారు . మోడీ విపక్షాలను అణగదొక్కే బదులు ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన తాను రేపు ధర్నా చేస్తానని చెప్పగానే, నోటీసులు పంపించారన్నారు . రేపటి ( శుక్రవారం ) ఒకరోజు మహిళా ధర్నా ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని , సాయంత్రం నాలుగు గంటలకు పూర్తవుతుందని చెప్పారు . మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజ్ లో ఉందని చెప్పారు . తాము ముందే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని, అనుమతి కూడా తీసుకున్నామని, కానీ పోలీసులు వేదిక మార్చుకోవాలని చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. వేదిక మార్చేది లేదన్నారు .
సోనియా గాంధీ పెద్ద నాయకురాలు అని, తాను చిన్న లీడర్ ను అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు కవిత . తాము బీజేపీ బీ టీంగా కాంగ్రెస్ చెబుతోందని, అదే నిజమైతే ఇలాంటి కేసులు ఎందుకు వస్తాయన్నారు . ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ పార్టీగా కనిపించడం లేదని, కనీసం ప్రాంతీయ పార్టీ బలం కూడా లేదని విమర్శించారు . బరా బర్ బీజేపీకి ప్రత్యామ్నాయం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ మాత్రమే అన్నారు . ప్రెస్ మీట్ చివరలో కవిత జై తెలంగాణ… జై భారత్ అంటూ ముగించారు .