కొద్దిసేపట్లో తాళి కట్టి, నుదుటన తిలకం దిద్దేందుకు సిద్దమైన వరుడికి షాక్ ను ఇచ్చింది వదువు. పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడని వధువు పెళ్లి చేసుకోనంది. ఈ ఘటన బీహార్ ( Bihar ) బాగల్ పుర్ లోని కహల్ గావ్ లో జరిగింది. కిట్టూ కుమారి అనే యువతికి ధనౌర్ ప్రాంతానికి చెందిన నీలేశ్ కుమార్ తో వివాహం నిశ్చయమైంది. వివాహానికి ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. ఊరేగింపుతో వరుడు పెళ్లిమండపానికి వచ్చాడు. వివాహ వేదికపైకి పెళ్లికుమారుడు వచ్చాడు. కాసేపట్లో తాళి కట్టి, దండలు మార్చుకుని, నుదుటన తిలకం దిద్దుతాడని అనుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు ఈ వివాహం తనకు ఇష్టం లేదని చెప్పింది. వరుడు తనకన్నా చాలా పెద్దగా కనిపిస్తున్నాడని, నల్లగా ఉన్నాడని చెప్పింది.
వివాహానికి విచ్చేసిన బంధువులు పెళ్లికూతురు నిర్ణయంతో షాక్ కు గురయ్యారు. వెంటనే రెండు కుటుంబాల పెద్దలు దంగంలోకి తిగి వధువుకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా పెళ్లికూతురు ఒప్పుకోలేదు. పెళ్లిపీటలమీద వరుడు బాలేదని చెడితే ఒక కుటుంబం పరువు బజారున పడుతుందని యువతి బందువులు తెలిపారు. అయినా పెళ్లికూతురు ఒప్పుకోలేదు. వధువు తండ్రి చెప్పినా పెడచెవిన పెట్టింది కిట్టూ కుమారి. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకుపోవడంతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.