Bhola Shankar: భోళా శంకర్ ఎఫెక్ట్..కొరటాల శివ ఫుల్ హ్యాపీ!
అసలు మెగాస్టార్ రేంజ్ ఏంటీ? జబర్దస్త్ గ్యాంగ్‌తో చేస్తున్న పనేంటి? ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు? అది కూడా రీమేక్‌లతో ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? మనవరాళ్ల వయసున్న అమ్మాయిలతో ఆ బిహేవియర్ ఏంటి? పక్కన ఆ భజన బ్యాచ్ ఏంటి? ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా సోషల్ మీడియాలో కామెంట్స్(comments) చేస్తున్నారు. దీంతో కొరటాల శివ(Koratala Siva) ఫ్యాన్స్ మావాడు ఫుల్ హ్యాపీ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.
ఆగష్టు 11న భోళా శంకర్(Bhola Shankar) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ వద్దని చెబుతునే ఉన్నారు. అయినా కూడా ఫామ్‌లో లేని మెహర్ రమేష్‌కు ఛాన్స్ ఇచ్చి.. భోళా శంకర్ ఓ రేంజ్లో ఉంటుందని జోరుగా ప్రమోషన్స్ చేశారు మెగాస్టార్. కానీ ఈ సినిమా థియేటర్లోకి అలా వచ్చిందో లేదో.. నెగెటివ్ వర్డ్స్ కోసం వెతుకుతున్నారు నెటిజన్స్. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో ఘోరంగా డిసప్పాయింట్ అయ్యారు. మెహర్ రమేష్‌తో పాటు మెగాస్టార్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కొరటాల శివ ఫ్యాన్స్ ఈ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నారు. భోళా శంకర్ టాక్ విన్న తర్వాత.. వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు కొరటాల శివ.
గతంలో చిరు, చరణ్‌తో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కించాడు కొరటాల. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో.. ఘోరమైన ట్రోలింగ్(trolling), విమర్శలు ఎదుర్కొన్నాడు కొరటాల. ఇక ఇప్పుడు భోళా శంకర్ దారుణంగా ఉందనే టాక్ బయటికి రావడంతో.. కొరటాలను ట్రెండ్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తు.. ఈ సమయంలో మోస్ట్ హ్యాపియెస్ట్ పర్సన్ కొరటాల శివనే.. అని ఆయన కాలర్ ఎగరెస్తున్న ఓ వీడియోని వైరల్ చేస్తున్నారు. అలాగే చిరంజీవిపై కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ.. ‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోందని’ ట్వీట్ చేశారు. అలాగే.. ‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు.. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు.. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే..’ అంటూ ఓ కొటేషన్ షేర్ చేశాడు. మొత్తంగా.. చేజేతులా ట్రోలింగ్‌కు అదిరిపోయే స్టఫ్ ఇచ్చారని అంటున్నారు నెటిజన్స్.