arrested people are tell to kavitha name why:Dk Aruna
Dk Aruna on Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) హీట్ పెంచుతోంది. ఈ కేసులో అరెస్టయిన వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) పేరే ఎందుకు చెబుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna) ప్రశ్నించారు. విచారణకు హాజరై తన నిజాయితీని కవిత (kavitha) నిరూపించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ (cm kcr) కుటుంబానికి ఆపద వస్తే.. తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవాలని చూడటం అలవాటు అయ్యిందని విమర్శించారు. కవితను (kavitha) ఈడీ విచారిణకు పిలిస్తే.. తెలంగాణ సమాజాన్నే అవమానించినట్టు ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు నోటీసులు వస్తాయని కవితకు (kavitha) తెలుసు అని.. అందుకే మహిళా రిజర్వేషన్ల పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ (brs) పార్టీ కక్ష సాధింపులకు పాల్పడుతుందని డీకే అరుణ (Dk Aruna) తెలిపారు. బీజేపీకి (bjp) అలాంటి అలవాటు లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపులకు దిగింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని అడిగారు. ఆ పార్టీ అలా చేస్తే మిగిలన వారు కూడా అలానే చేస్తారా అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో కవితను (kavitha) ఈడీ విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు విచారణకు హాజరవాల్సి ఉండగా.. రేపు జంతర్ మంతర్ వద్ద నిరసన ఉన్నందున మరో రోజు హాజరవుతానని కవిత ఈడీకి లేఖ రాశారు. అందుకు ఈడీ కూడా సమ్మతించి.. 11వ తేదీన విచారణకు రావాలని స్పష్టంచేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) మెడకు చుట్టు బిగుస్తోంది. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) అరెస్ట్ చేశారు. తీహార్ జైలు నుంచి ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ మీద బయటకు వచ్చారు. మరో అనుచరుడు రామచంద్రా పిళ్లైను (ramachandra) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతను కవిత ప్రతినిధిని అని ఈడీ అధికారులకు (rd officials) చెప్పారట. దీంతో లిక్కర్ స్కామ్లో కవిత (Kavitha) అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. కవిత నిన్ననే ఢిల్లీ వెళ్లారు. రేపు మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతారు. ఎల్లుండి ఈడీ విచారణకు కవిత హాజరవుతారు.