»Apple Employee Gets Rare Gift After Completing 10 Years In Company
Apple employee gets rare gift: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అరుదైన బహుమతి
తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే.
తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే. యాపిల్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తోంది. కంపెనీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తూ, దీర్ఘకాలంగా తమ వద్ద ఉంటున్న వారికి రేర్ గిఫ్ట్ ఇచ్చింది ఈ టెక్ దిగ్గజం. పదేళ్లుగా కంపెనీ కోసం పని చేస్తున్న వారికి యాపిల్ ఓ అరుదైన బహుమతిని అందించింది. అల్యూమినియంతో తయారు చేసిన ఓ చిహ్నంతో పాటు యాపిల్ పాలిషింగ్ క్లాత్ ఇచ్చి, ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పింది. ఈ మేరకు సంస్థ సీఈవో టిమ్ కుక్ (Timk Cook) స్వయంగా సంతకం చేసిన ప్రశంసాపత్రాన్ని కూడా అందించింది.
ఈ గిఫ్ట్ ఓపెన్ చేయగానే టిమ్ కుక్ పర్సనల్ నోట్ కనిపిస్తుంది. కంపెనీకు, మారుతున్న ప్రపంచానికి అందించిన సేవలకు గాను సదరు ఉద్యోగికి అందులో థ్యాంక్స్ చెబుతూ ఉంటుంది. అదనంగా పాలిషింగ్ క్లాత్ అందించింది. భారత కరెన్సీలో దీని వ్యాల్యూ రూ.1900 వరకు ఉంటుంది. ఈ పదేళ్లలో సదరు ఉద్యోగి సాధించిన విజయాలను, పది సంవత్సరాల మైలు రాయిని అందులే పొందుపరిచారు. అంతేకాదు, పదేళ్లు ఏ తేదీకి పూర్తవుతుందో ఆ తేదీ నోట్ చేశారు. ఉద్యోగాల కోత అమలు చేయని అతి కొద్ది కంపెనీల్లో యాపిల్ ఉంది. గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు వేలాది ఉద్యోగులను తొలగించాయి. కానీ యాపిల్ మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతోంది. కరోనా సంక్షోభ సమయంలోను ఇతర సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోగా యాపిల్ మాత్రం కార్యకలాపాల విస్తరణలో సంయమనం పాటించింది. మిగతా సంస్థల్లాగా యాపిల్ తన ఉద్యోగులకు అదనపు సౌకర్యాల కల్పన పేరిట వృథా ఖర్చులు చేయదు. సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన వేతనంలో ఏకంగా 50 శాతం మేర కోత విధించుకున్నారు.