»Ap Letter To Krmb To Direct Telangana To Give 7 Tmcs Urgently April 14th 2023
AP letter: 7 TMCలు అత్యవసరంగా కావాలి..తెలంగాణను ఆదేశించాలని KRMBకి ఏపీ లేఖ
నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ తన కోటా కంటే ఎక్కువగా నీటిని వినియోగించుకుందని ఏపీ జలవనరుల శాఖ KRMBకి తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రానికి అత్యవసరంగా 7 టీఎంసీల నీరు అవసరం ఉందని..అందుకోసం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తమకు ఇప్పించాలని లేఖలో కోరింది. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది.
నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువ నుంచి అత్యవసరంగా నీటి అవసరం కోసం ఏపీ జలవనరుల శాఖ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB)కి లేఖ రాసింది. ఎండాకాలం వచ్చిన నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం 7 టీఎంసీల నీరు కావాలని లేఖలో కోరింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి చెప్పి తమకు ఆ నీటిని సమకూర్చాలని తెలిపింది. ఈ నేపథ్యంలో సాగర్ కుడి కాలువ నుంచి 6 టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి ఒక టీఎంసీ ఇచ్చే విధంగా ఆదేశించాలని ఏపీ జలవనరుల శాఖ లేఖలో స్పష్టం చేసింది. మరోవైపు కృష్ణా బేసిన్లో నీటి వినియోగం వాటా గురించి కూడా లేఖలో మరోసారి గుర్తు చేసింది.
దీంతోపాటు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి 126 టీఎంసీల నీటికి వాడుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వానికి అవకాశం ఉందని గుర్తు చేసింది. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ తన కోటా కంటే ఎక్కువ టీఎంసీల నీటిని వినియోగించుకుందని ఏపీ జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. అన్ని వివరాలను కేఆర్ఎంబీకి పంపించామని, తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఎండకాలం వచ్చిన క్రమంలో నాగార్జున సాగర్లో నీటి నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వెల్లడించారు.