»Ap High Court Notice To Relatives Of Minister Rajini And Avinash Reddy
AP High Court: మంత్రి రజని, అవినాష్ బంధువులకు హైకోర్టు నోటీసులు
ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(vidala rajini), ఎంపీ అవినాష్ రెడ్డి(mp avinash reddy) బంధువులకు(relatives) హైకోర్టు(ap High Court) నోటీసులు(notices) జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని మురుకిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(vidala rajini), ఎంపీ అవినాష్ రెడ్డి(mp Avinash reddy)కి షాకింగ్ న్యూస్ తగిలింది. ఏపీ హైకోర్టు(ap high court) గుంటూరు జిల్లాలోని మురుకిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి రజని, ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు శ్వేతా రెడ్డి, జీవీ దినేష్ రెడ్డి, శివ పార్వతులకు నోటీసులు(notices) జారీ చేసింది.
అయితే ఎస్టీ, ఎస్టీలకు ఇచ్చిన భూముల్లో డీకే పట్టాలు రద్దు చేయకుండానే గ్రానైటు తవ్వకాలు జరిపారని పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశంపై విచారించిన ధర్మాసనం 21 ఎకరాల 50 సెంట్ల భూమిలో గ్రానైట్ తవ్వకాలకు NOC ఇచ్చిన తహసీల్దార్ సహా ఇంకొంత మందికి కూడా నోటీసులు పంపించింది. మరోవైపు రైతులు పనులు చేస్తున్న క్రమంలో అడ్డుకున్న ఎస్సైకి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆ భూముల్లో ప్రతి ఎకరంలో రూ.200 కోట్ల విలువైన గ్రానైట్ నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు తెలియకుండా NOC ఇవ్వడంపై హైకోర్టు(ap high court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని మంత్రితోపాటు ఇతరులకు కూడా ధర్మాసనం తెలిపింది.