అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధి ఆర్ఆర్ సెంటర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుత్తా ఆంజనేయులు(59) తన ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి అతని తలపై నరికి హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్య ఎవరు చేశారు? హత్యకు గల కారణాలు ఏంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.