TG: హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్ భవనం ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కంపెనీలోని ఉద్యోగులను అధికారులు బయటకు పంపించివేశారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.