ELR: వల్లూరు రైల్వే స్టేషన్ సమీప పట్టాలపై రైలు ఢీకొని మృతిచెందిన మృతుడి వివరాలను SI సైమన్ బుధవారం తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ మృతుడు దూబ సాయి (20) CR రెడ్డి ఇంజినీరింగ్ EEE 3వ సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు. రాత్రి ఫోన్ మాట్లాడుకుంటూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గారిభరాత్ రైలు ఢీ కొట్టిందన్నారు. మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పమన్నారు.