సిక్కిం సెక్టార్‌లోని జులుక్ ప్రాంతంలో సైనికులు ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 12 మంది సైనికులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా తూర్పు ఎయిర్ కమాండ్ నుంచి చీతా హెలికాప్టర్లతో పాటు ఎంఐ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌ను అధికారులు పంపారు.