ఉమ్మడి కడప జిల్లా ఓబులవారిపల్లె(M) కొత్తమంగంపేటలో ఆంజనేయులు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. అతడిని చంపిన వ్యక్తి సంచలన విషయాలు వెల్లడించాడు. ‘కువైట్ వెళ్తూ నా కుమార్తెను నా చెల్లెలి ఇంట్లో విడిచిపెట్టా. ఇటీవల మా చెల్లె మామ ఆంజనేయులు నా బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే కువైట్ నుంచి వచ్చి నేనే చంపాను వాంగ్మూలం ఇచ్చాడు.