రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Panjab National Bank) సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు. యాచకురాలి(Begger) పక్కనే భర్త కూడా ఉండటం గమనార్హం.
పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పాప్ లను కలుషిత నీటితో, ప్రమాదకర కెమికల్స్ తో తయారు చేసి మార్కెట్ లో అమ్మేస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా బయటపడింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్(Jagadish Shettar)పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
నేపాల్లోని బాగ్మతి ప్రావిన్స్(Bagmati Province)లోని మారుమూల ప్రాంతంలో కారు లోయలో పడటంతో నలుగురు భారతీయులు మరణించారు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
దిశా కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సహా పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. ఈ సందర్భంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
రాజస్థాన్లో ప్రధాని మోడీ తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును బుధవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి.
మహీంద్రా & మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా, బుధవారం కన్నుమూశారు. 99 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. అతను ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 కొత్త బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.
కాంగ్రెస్(Congress) సీనియర్ లీడర్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి(K.Jana Reddy) గుండె పోటు బారిన పడ్డారు. తెల్లవారు జామున ఛాతీలో నొప్పి రావడం తో వెంటనే జానారెడ్డిని కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి కి తరలించారు.
జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి త్వరలోనే ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ నేతృత్వంలో ఈ కమిటీని ప్రకటించనుంది.