SKLM: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని హోమ్ కంపోస్ట్ తయారీపై మహిళలకు మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు శనివారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. తడి చెత్తను ఉపయోగించి కంపోస్టును ఎలా తయారు చేయాలో తెలిపారు. అదే విధంగా పొడి చెత్తను వీధులలో వచ్చే వాహనంలో వేయాలన్నారు. ఈ ఎరువులను మొక్కలకు ఉపయోగించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.