W.G: పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీ రాఘవ దొర డల్లాస్లో మృతి చెందిన సంఘటన విదితమే. అతని భౌతికకాయం మంగళవారం స్వగ్రామం కానూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల రోదనల మధ్య గ్రామం మార్మోగింది. చదువు నిమిత్తం వెళ్లిన కుమారుడు విగతజీవిగా రావడం పట్ల కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా మారింది.