AKP: నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామానికి చెందిన మాకిరెడ్డి కల్పన అనే గృహిణి సైబర్ నేరస్తుల వలలో పడి రూ.3.79 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. రూరల్ ఎస్సై రాజారావు తెలిపిన కథనం ప్రకారం షేర్‌చాట్‌లో ఆమె జాబు కోసం ప్రయత్నిస్తుండగా సైబర్ నేరస్తులు ఆమెకు లింకు పంపించారు. లింక్‌లో ఉన్న సమాచారాన్ని పంపిస్తే డబ్బులు పంపిస్తామని ఆశ చూపించారు.